దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్

0
2

దేవాపూర్: పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ సూచించారు.గురువారం దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. ఎస్‌ఐ గంగారాంను కేసుల ఆన్‌లైన్ నమోదు, ఐటీఎస్‌ఓ కేసులు, ఈ-సాక్ష్య, ఈ-సమన్ల అమలు, దర్యాప్తులో ఉన్న (UI) కేసులు, పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించి పలు సూచనలు చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్ కలిగిన వ్యక్తులు, ఇతర నేర చరిత్ర ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ మేనేజ్‌మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి అధికారి, సిబ్బంది సీసీటీఎన్ఎస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.అలాగే ప్రజలు, వ్యాపారులు తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని డీసీపీ ఎ.భాస్కర్ పోలీస్ సిబ్బందికి సూచించారు.