మందస ఎంపీపీగా భావన కుర్మావతి ప్రమాణ స్వీకారం

0
3

మందస ఎంపీపీగా భావన కుర్మావతి ప్రమాణ స్వీకారం

వైస్ ఎంపీపీగా కొండపల్లి నారాయణ బాధ్యతల స్వీకరణ

మందస: మందస మండల ప్రజా పరిషత్ నూతన అధ్యక్షురాలిగా భావన కుర్మావతి, ఉపాధ్యక్షుడిగా కొండపల్లి నారాయణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సందడిగా సాగింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేయాలన్నారు.

మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మందస మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

మండల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు.