తమ మిలిటరీ రవాణాకు కీలకమైన క్రిమియా బ్రిడ్జిపై ఉక్రెయిన్ దాడి చేయడంతో రష్యా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వైద్య సదుపాయాలు, సైనిక సంబంధిత ప్రదేశాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. 400కు పైగా డ్రోన్లు, 110 మిస్సైళ్లు ప్రయోగించగా అందులో 27 బాలిస్టిక్ క్షిపణులు, క్లస్టర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. ఈ దాడుల్లో 8 మంది ఉక్రెయినియన్లు మరణించారు.









