‘5 ఏళ్ల ప్రగతి’ కరపత్రం విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి దువ్వాడ రవి

0
5

అభివృద్ధి బాటలో అల్లుకోల పంచాయతీ

‘5 ఏళ్ల ప్రగతి’ కరపత్రం విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి దువ్వాడ రవి

ఎస్. గోవిందపురం, సుబ్బుగుడ్డి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని వెల్లడి

పలాస: అల్లుకోల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్. గోవిందపురం, సుబ్బుగుడ్డి గ్రామాల్లో గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, గ్రామ సర్పంచ్ అభ్యర్థి దువ్వాడ రవి (రాజశేఖర్) ఎన్నికల కరపత్రాన్ని విడుదల చేశారు. ‘గ్రామ సర్పంచ్ అభ్యర్థి – 5 ఏళ్ల ప్రగతి & భవిష్యత్ సంకల్పం’ శీర్షికతో రూపొందించిన ఈ కరపత్రంలో గ్రామాల అభివృద్ధి, సేవా దృక్పథం, భవిష్యత్ లక్ష్యాలను ప్రముఖంగా పొందుపరిచారు.

 

**గత ఐదేళ్లలో చేపట్టిన పనులు**

కరపత్రంలోని వివరాల ప్రకారం, రెండు గ్రామాల్లో పలు మౌలిక సదుపాయాల పనులు చేపట్టారు:

* సుబ్బుగుడ్డి గ్రామానికి వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిని తొలగించి, పెద్ద వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు.

* ఎస్. గోవిందపురంలో 300 మీటర్ల మురుగు కాలువ నిర్మించి, మురుగు నీరు ప్రధాన రహదారిపైకి రాకుండా చేశారు. పిల్లలు, పశువులు పడిపోకుండా సిమెంట్ మూతలు ఏర్పాటు చేశారు.

* తాగునీటి కోసం వాటర్ ట్యాంక్, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేశారు. వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువు గట్టును బాగు చేయించి మెట్లు నిర్మించారు.

* గ్రామస్తుల విశ్రాంతి కోసం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. శ్రీ దక్షిణాధీశ్వర స్వామి ఆలయం వద్ద మంచినీటి కుళాయి, విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు కృషి చేశారు.

* ఎస్. గోవిందపురంలో వెల్‌నెస్ సెంటర్ ఆధునికీకరణతో పాటు పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు.

* కుల, మత, పార్టీల తేడా లేకుండా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు. కరోనా సమయంలో ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, శుభకార్యాలు, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారు.

 

**సేవా స్ఫూర్తి – భవిష్యత్ సంకల్పం**

వార్డు సభ్యులు, గ్రామస్తులు, దాతల సహకారంతోనే ఈ పనులు ముందుకు సాగాయని రవి పేర్కొన్నారు. కష్టాలు, అవమానాలు ఎదురైనా ఓర్పు, సహనంతో ఉండాలనే భావనను తన తండ్రి కీ.శే. దువ్వాడ ప్రకాశరావు నుంచి, ఏ పథకాన్నీ స్వార్థానికి దుర్వినియోగం చేయకూడదనే ఆదర్శాన్ని శ్రేయోభిలాషుల నుంచి, కులమత ప్రాంతాలకు అతీతంగా సేవ చేయాలనే దృక్పథాన్ని ఆత్మీయుల నుంచి నేర్చుకున్నానని వివరించారు.

తెలియక ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరిన ఆయన, పదవి వ్యామోహం కంటే సుబ్బుగుడ్డి, ఎస్. గోవిందపురం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. “ఓటు వ్యక్తికి కాదు… మన ఊరి భవిష్యత్తుకు! జై అల్లుకోల పంచాయతీ!” అనే నినాదంతో ప్రజల ఆశీస్సులు కోరారు.