శ్రీరాంపూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఒకరోజు ఫెన్సింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, కార్యదర్శి అవునూరి మహేష్ తెలిపారు.ఈ క్యాంపులో అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాలకు చెందిన అర్హత గల ఫెన్సింగ్ క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రగతి స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ క్యాంప్ మంచి అవకాశమని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపుకు సంబంధించిన సందేహాలుంటే కోచ్ ఎదునూరి వెంకటేష్‌ను 95508 38190 చరవాణి ద్వారా సంప్రదించాలని తెలిపారు.










