మహబూబాబాద్: కొత్తగూడ, గంగారం మండలాల్లో కండ్ల కలక (శుక్ల) వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఆర్.బి.ఎస్.కె మొబైల్ హెల్త్ టీం ఆధ్వర్యంలో పోలారం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు వ్యాధిపై అవగాహన డాక్టర్ సాయినాథ్ కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాయినాథ్ మాట్లాడుతూ.. కళ్లు ఎర్రబడటం, దురద, మంట, నీరు కారడం ప్రధాన లక్షణాలని తెలిపారు. వైద్యుల సలహా లేకుండా సొంతంగా ఐ డ్రాప్స్ వాడొద్దని సూచించారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు.










