హైదరాబాద్లోని కోకాపేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద, పటాన్చెరు వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఢీకొన్న కొద్ది నిమిషాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వెంటనే కారులోని నలుగురు ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం కారణంగా ఓఆర్ఆర్పై కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కారు అదుపు తప్పిందా లేదా బ్యాటరీ లోపం వల్ల మంటలు వ్యాపించాయా అనే కోణంలో నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు










