AP: 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రేపు నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు జరగనున్నాయి. కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్పర్సన్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు SEC ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో నూతన పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది.









