కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తే కార్తీకమాసం హరిహరాదులకు అత్యంత ప్రీతిపాత్రమైనది.ఈ మాసంలో రేపు కార్తీక పౌర్ణమి ఈ రోజున నది స్థానం చేస్తే శ్రేష్టమని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం వేళలో ఇల్లు,ఆలయాలలో దీపాలు వెలిగించటం ఆచారంగా కొనసాగుతుంది.ఏడాదిలోని 365 రోజులకు ప్రతీకగా 365 వత్తులతో ప్రత్యేక దీపాన్ని వెలిగిస్తారు. దీంతో ఏడాది పొడవునా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఉసిరి దీపంతో అప్పులు, అనారోగ్యం దూరం. భక్తులు తెల్లవారుజామునే తల స్థానం చేసి శివలింగానికి అభిషేకం,బిల్వార్చన చేయాలి, ఉపవాసం ఉండాలి. సాయంత్రం తులసి కోట వద్ద మరియు శివాలయంలో ఉసిరి దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందని విశ్వాసం. శివుడిని పూజిస్తే కష్టాలు, అప్పులు,ఆరోగ్య సమస్యలు తొలగి జీవితంలో ఆనందం,అభివృద్ధి లభిస్తాయి. 360 ఒత్తుల సంఖ్యకు స్కాంద పురాణాల్లో 720 ఒత్తుల దీపారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.360 సంఖ్య సంవత్సర కాల చక్రానికి ప్రత్యేకగా భావిస్తారు. 720 వత్తులు పగలు, రాత్రులకు సంకేతికంగా ఆధ్యాత్మికoగా అన్వయించబడుతున్నాయి. దీపారాధన సంఖ్యతో పాటు భక్తి,శ్రద్ధలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది.ఆలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణం దర్శనం ప్రత్యేకత. త్రిపురాసుర సంహారం, ఆలాహల విషపానం ఘట్టాలతో దీనికి పురాణ ప్రాధాన్యం ఉంది.తులసి కోట వద్ద 365 వత్తులతో దీపం వెలిగించడం ఈ పర్వదినంలోని ముఖ్య ఆధారాలు ఇవి పాటించటం వలన శుభప్రదం అని పురాణాలు చెబుతున్నాయి.









