ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉండగా, తమ కాలనీలో నెలకొన్న ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
స్థానికుల డిమాండ్లు:
వెంటనే నీటి లీకేజీని అరికట్టాలి.
దెబ్బతిన్న పైప్‌లైన్‌ను శాశ్వతంగా మరమ్మతు చేయాలి.
నీటి వృథాకు బాధ్యులైన సంబంధిత సిబ్బంది స్పందించాలి.
సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు పర్యవేక్షణ చేయాలి.
ప్రజలకు తాగునీరు అందించాల్సిన వ్యవస్థలోనే నీరు వృథా అవుతుంటే ఇక ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత జలమండలి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి అన్నపూర్ణ కాలనీ నీటి లీకేజీ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.










