కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్‌తో పూలకు భారీ డిమాండ్ – కిలో మల్లె రూ.1,000!

0
3

కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్‌ కలిసిరావడంతో నిజామాబాద్ జిల్లాలో పూలకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో మల్లె, చామంతి, గులాబీ, కనకాంబరం పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ప్రస్తుతం కిలో మల్లెపూల ధర రూ.800 నుంచి రూ.1,000 వరకు పలుకుతోంది. ఆలయాల్లో దీపోత్సవాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికం కావడంతో పూల కొనుగోళ్లకు మార్కెట్లలో రద్దీ పెరిగింది. 

పూలకు డిమాండ్ పెరగడంతో రైతులకు మంచి ధర లభిస్తున్నప్పటికీ, అధిక ధరల కారణంగా సామాన్య వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూల ధరల పెరుగుదలతో పండుగలు, శుభకార్యాల ఖర్చులు మరింత భారంగా మారాయని వినియోగదారులు పేర్కొంటున్నారు .