తెనాలిలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు

0
2

తెనాలి సాయంత్రం వేళల్లోనూ న్యాయస్థానాలు నిర్వహించాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెనాలి న్యాయవాదులు విధులు  బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కోర్టులు నిర్వహిoచాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ నవంబర్ 25, 26, 27 తేదీలలో మూడు రోజులపాటు కోర్టు విధులను హాజరుకాకుండా ఉండాలని నిర్ణయించారు.