అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జడ్పిటిసి సుర్ల సత్యంనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సొంత గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారని చెప్పారు.









