ప్రజలే నిధి నమ్మకమే బలం కొవ్వూరులో విప్లవాత్మక మార్పు

0
0

రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఇక్కడ అభ్యర్థి ఓటర్లకు డబ్బు పంచలేదు. పైగా ఓటర్లే అభ్యర్థికి విరాళాలు ఇచ్చి నువ్వు నిలబడు మేమున్నాం అని భరోసా ఇచ్చారు.మితభాషి, నిస్వార్థపరుడు, ప్రతి కుటుంబ కష్టంలో అండగా నిలిచే కోలిపల్లి ఈశ్వరరావును గెలిపించుకోవాలని యువకులు, ఓటర్లు ఏకతాటిపైకి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి ఓటు వేశారు.ఫలితంగా ప్రత్యర్థి ఎర్రంశెట్టి గుణశేఖర్ 214 ఓట్ల మెజారిటీతో ఈశ్వరరావు ఘన విజయం సాధించారు. ఓటుకు నోటు కాదు, మార్పుకు ఓటు అని కొవ్వూరు నిరూపించింది.