జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

0
14

మంచిర్యాల జిల్లా : ఆదిలాబాద్‌లో ఈ నెల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉషు పోటీలలో ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఐఏఎస్ కుమార్ దీపక్ అభినందించారు.రాష్ట్రస్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన సాహిత్ పటేల్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగే జాతీయస్థాయి ఉషు పోటీలకు, సీనియర్ మహిళా విభాగంలో బంగారు పతకం సాధించిన ప్రవళిక అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి మహిళా ఉషు పోటీలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా ఇద్దరు క్రీడాకారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందిస్తూ, జాతీయస్థాయి పోటీలలో కూడా పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు కష్టపడి సాధన చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.అలాగే రాష్ట్రస్థాయి పోటీలలో పతకాలు సాధించిన రజత పతక విజేత సాహితీ, కాంస్య పతక విజేతలు శ్రీనిధి, శ్రీచైత్ర, సాయి, ప్రణీత, హర్షిత్ పటేల్‌లను కూడా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి (DYSO) హనుమంత్ రెడ్డి, జిల్లా ఉషు అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల రాజనర్సు, ప్రధాన కార్యదర్శి శివ మహేష్, కోచ్ జితేందర్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.