రోలుగుంట జెడ్పీ హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) గా పనిచేస్తున్న పి.వి.ఎం. నాగజ్యోతి మైసూరులోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో జరిగిన ఐదు రోజుల ఐసీటీ ఇంటిగ్రేటెడ్ పెడగాజీ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.నవంబర్ 23 నుంచి 27 వరకు దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ఈ రెండో విడత శిక్షణలో డిజిటల్ బోధనా పద్ధతులపై ప్రత్యేక శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసినందుకు సంస్థ ఆమెకు సర్టిఫికెట్ అందజేసింది.










