అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను లక్ష్యంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గురువారం గ్రామాల్లో పర్యటించి సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
ఓటీపీ మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి జాగ్రత్తలు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహన తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించారు. ప్రజలు చట్టాలను గౌరవించాలని పోలీసులు కోరారు.










