సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం

0
5

పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి దివ్య ప్రాణాలు కోల్పోయింది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోహార భూబన్స,సరస్వతి దంపతుల మూడు నెలల క్రితం ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు.సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనిలో

నిమిత్తమై ఉండగా చిన్నారి తన తోబుట్టులతో కలిసి గుడిసెల వద్ద ఆడుకుంటుంది.ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కుక్కల గుంపు ఒకసారిగా దాడి చేసి చిన్నారి మేడం తీవ్రంగా గాయపరిచింది.ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే చిన్నారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.