పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త

0
3

నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.నిజామాబాద్ నగరం లో బాబన్ సా పహాడి లో ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2022 సంవత్సరంలో రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.