మహిళల అక్రమ రవాణాను అరికట్టండి

0
2

మహిళల అక్రమ రవాణాను అరికడదాం: రాయపాటి శైలజ

మహిళలు, పిల్లల అక్రమ రవాణా తీవ్ర సామాజిక సమస్య అని, దీనిని అరికట్టేందుకు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. విజయవాడ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం 126 ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని, వీటిని తగ్గించేందుకు ‘శక్తి’ యాప్ వంటి సాంకేతికతను వాడుతున్నామని తెలిపారు.

బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ, నిందితులకు శిక్ష పడేలా విభాగాల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. మాజీ ఐపీఎస్ పి.ఎం. నాయర్ ఈ సందర్భంగా పోలీసు అధికారులకు దర్యాప్తు పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.