మద్యం, మెడికల్ మాఫియాపై ఏఐవైఎఫ్ (AIYF) పోరాటం: జి. కోటేశ్వరరావు
విజయవాడలో మద్యం మాఫియా అరాచకాల వల్ల యువత ప్రాణాలు బలైపోతున్నాయని, కుటుంబాలు వీధిన పడుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో జరిగిన ఏఐవైఎఫ్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మాఫియాలను అదుపు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు.
ఈ క్రమంలో, మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఏప్రిల్ 30న విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి (GGH) వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఏఐవైఎఫ్ నేత లంకా గోవిందరాజులు ప్రకటించారు. మే 3న సంస్థ 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.










