ప్రభుత్వ తీరుపై రిటైర్డ్ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆగ్రహం: కోర్టులో కేసు ఫైల్
పోలీసు శాఖలో 35 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాలు తన మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ..
లడ్డూలో హార్పిక్, మాంసం కలిశాయంటూ ఆధారాలు లేకుండా భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో పాటు 100 మంది ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు స్పందించకపోవడంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నానని, తన ఫిర్యాదు తప్పని తేలితే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని సవాల్ విసిరారు.










