అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్

0
1

అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు అందజేస్తాం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పటమటలోని తన కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పింఛన్లు, ఇళ్ల స్థలాలు మరియు స్థానిక సమస్యలపై వినతులు స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, ముఖ్యంగా పింఛన్లు, ఇళ్ల స్థలాల అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్‌లోని విద్యుత్ సమస్యలపై అధికారులతో మాట్లాడతానని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు.