*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*
బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ డ్రైవర్ పై మహిళ చెప్పుతో కొట్టిన ఘటన మోపిదేవిలో శుక్రవారం చోటు చేసుకుంది.
సేకరించిన వివరాల మేరకు అవనిగడ్డ నుంచి విజయవాడ వెళుతున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై మహిళ బస్సు ఎక్కడానికి ఆపింది. కానీ బస్సు ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. దీంతో మహిళ బస్సును వెంబడిస్తూ, మోపిదేవి ప్రధాన సెంటర్లో బస్సు ఎక్కి, డ్రైవర్ ను చెప్పుతో చెంప మీద కొట్టింది. అంతటితో ఆగని సదరు మహిళ తన బంధువులకు ఫోన్ చేసి చల్లపల్లి బస్ స్టాప్ కు పిలిపించి వారితో డ్రైవర్ ను కొట్టించింది. దీంతో బస్ స్టాప్ లో కొద్దిసేపు ఆర్టీసీ ఉద్యోగులు, మహిళకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
మహిళకు బంధువైన ఒక కానిస్టేబుల్ సదరు గొడవలో ఎంటరై, పంచాయితీ స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేశారు.
బస్సు ఆపనంత మాత్రాన డ్రైవర్ ను కొడతారా……. కొట్టిస్తారా……. అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. చివరకు ఏమవుతుందో వేచి చూడవలసిందే.










