రసాయన విపత్తులకు అడ్డుకట్ట లక్ష్యంగా కార్యాచరణ

0
1

ఈ నెల 29న ఐవోసీఎల్ టెర్మినల్‌లో మాక్‌డ్రిల్: జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం, కట్టుబడిపాలెం ఐవోసీఎల్ టెర్మినల్‌లో ఈ నెల 29న రసాయన విపత్తుల నివారణపై మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ తెలిపారు. విపత్తు సమయాల్లో తక్షణ స్పందన, శాఖల మధ్య సమన్వయం, ప్రజా రక్షణ చర్యలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

శుక్రవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, పరిశ్రమల శాఖల అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రమాద సమయంలో బాధితుల తరలింపు, వైద్య సేవలు, అగ్నిమాపక చర్యలపై పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని జేసీ ఆదేశించారు.