అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు అంకురార్పణ, గణపతి పూజ, పుట్టమన్ను సేకరణతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆలయ అర్చకుల ప్రకారం, స్వామివారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు రాత్రి స్వామివారు సింహ వాహనంపై పుర వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు# కొత్తూరు మురళి.










