మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, కోర్టు తీర్పుతోనైనా ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు ఆగిపోవాలని పేర్కొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని అని, దీనిపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సబితా కిషోర్, పరశురామ్ రెడ్డి, జగదీష్ గౌడ్, రాము యాదవ్, డోలి రమేష్ మరియు ఇతర పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ కలిసి పార్టీ జెండాలతో విజయోత్సాహం జరుపుకున్నారు.
#sidhumaroju










