నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వడం ద్వారా రాజకీయ వేధింపులకు తెరపడిందని, న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు గారిపై కక్షపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు అని విమర్శించారు.
నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ కక్షలను వీడి, ప్రజా పాలనపై దృష్టి సారించాలని గణేష్ బిగాల సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.










