ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత: టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సొంత పార్టీలోని కొందరు నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేల పట్ల చులకన భావం ఉందని, ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి, గెలిపించడానికి ఎస్సీలు కావాలి కానీ, అధికారంలో ఉంటే తొక్కేయాలా? అని ఆయన నిలదీశారు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం సరికాదని, మేము బానిసలుగా ఉండాలా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.
ఏ తప్పూ చేయని ఎస్సీ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ వివక్షను ఇకపై భరించే ప్రసక్తే లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.










