ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది: AISF రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు
కర్నూలులో జరిగిన AISF జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు మాట్లాడుతూ, ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు.
జీవో నంబర్ 3 ద్వారా ఉన్నత విద్యా మండలి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇంటర్ విద్యా మండలి నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ కళాశాలలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యాశాఖ మంత్రి కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.










