ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష.

0
5

మదనపల్లెలో 2018లో జరిగిన ట్రాక్టర్ బోల్తా ఘటనలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు శుక్రవారం 2వ ఏడీజే కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.

గుట్టవారిపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ఇద్దరు కూలీలు ఈ దుర్ఘటనలో మరణించారు. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది.