ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో

0
6

స్థానిక మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ reg.no (1630/1982) వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లో24.04.2026 శుక్రవారం రోజు మందమర్రి ఏరియాలో సింగరేణి ఉద్యోగిగా విధులు నిర్వర్తించి గ్రూప్ -1 లో సెలెక్ట్ అయి మంచిర్యాల జిల్లా లో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వచ్చిన దుర్గం క్రాంతికుమార్ గారిని కలెక్టర్ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దామెర ప్రవీణ్ కుమార్ గారు,సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ గారు,మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ హరిరామకృష్ణ,శ్రీరాంపూర్ ఏరియా నాయకులు కంబాల నాగయ్య,దాసరి సంపత్, మోతె రవి,అశోక్,సమ్మయ్య, ప్రదీప్, రవీందర్, వినోద్,తదితరులు పాల్గొనడం జరిగింది.