అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తులను శేష వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం ఉభయదారులుగా వ్యవహరించింది# కొత్తూరు మురళి.










