మదనపల్లె గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.

0
4

మదనపల్లెలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. రంగనాయకులు తెలిపారు. 3వ తరగతిలో 40 సీట్లు, 4వ తరగతిలో 36, 5వ తరగతిలో 32, 6వ తరగతిలో 25, 7వ తరగతిలో 21, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థులకు ఉచిత వసతి, ఆహారం, పుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి గలవారు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలి.