పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష

0
3

తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ అలియాస్ సుధాకర్ (29)కు తిరుపతి ఆర్.ఎస్.ఎస్.ఏ.డి.జె. కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది.

శుక్రవారం రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇతనిపై 2018లో రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయమూర్తి నరసింహమూర్తి ఈ తీర్పు వెలువరించారు.