గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఆహారం కోసం అడవుల నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగులు తోటల వైపు కదిలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఒంటరిగా తోటలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
#Boiena Rajesh










