మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) సంతోష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం చింతూరు మండలం చట్టి గ్రామంలో ఆటో మరియు బైక్ రైడర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.అవగాహన లేని వయసులో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ముప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.” అని ఎస్ఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు
# Yadagiri










