అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా పెట్రోల్ బంకులను తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారని, మదనపల్లి, గుర్రంకొండ, గాలివీడు తదితర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, ఎక్కడా రద్దీ లేదని తెలిపారు. ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, బంకులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.









