మదనపల్లెలో కోళ్ల బైళ్ళు వన్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరి నగర్‌కు చెందిన కె. జయచంద్ర సోమవారం పీ.జీ.ఆర్.ఎస్.లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 529, 617/2-4లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, సొసైటీ రామచంద్ర.
మేజారి మురళి కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆదేశాలను ఉల్లంఘించి పునాదులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.









