ఏయూ పరిశోధనలకు రూ.250 కోట్లు కేటాయించండి: సీఎంకు నారా లోకేశ్ విజ్ఞప్తి
ఆంధ్రా యూనివర్సిటీ శత వసంతాల ముగింపు వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రసంగం చేశారు. ఏయూలో పరిశోధన రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.250 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వేదికపై నుంచే కోరారు. వర్సిటీలు కాలానుగుణంగా సిలబస్‌ను మార్చుకోవాలని, పరిశోధనలకు పెద్దపీట వేయాలని సూచించారు.
ఈ సందర్భంగా తన ఓటమి, గెలుపు ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ “నో రిస్క్ – నో స్టోరీ” అని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఏయూ దేశానికే తలమానికమని కొనియాడిన ఆయన, ఏడాదిలోగా యూనివర్సిటీల్లో పెండింగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విశాఖలో గూగుల్ సంస్థకు భూమిపూజ చేయబోతున్నట్లు వెల్లడించారు.









