ఏయూ ఒక గ్లోబల్ బ్రాండ్.. రాబోయే వందేళ్లూ మనవే: సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏయూ రాబోయే వందేళ్లలో ప్రపంచస్థాయి బ్రాండ్‌గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వర్సిటీ అభివృద్ధి కోసం రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ రూపురేఖలు మారుతాయని, ఏయూ విద్యార్థులు ఆవిష్కరణలు, స్టార్టప్‌లపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావుల పునాదులపై నిర్మితమైన ఈ వర్సిటీ, భవిష్యత్తులో పారిశ్రామిక రంగానికి అనుసంధానకర్తగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.








