మొక్కజొన్న రైతుల సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,600 – రూ.1,700 మాత్రమే పలుకుతోందని, ఇది మద్దతు ధర (రూ.2,400) కంటే చాలా తక్కువని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకోవడానికి PM-AASHA పథకం కింద ‘ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని’ (PDPS) అమలు చేయాలని కోరారు. దీనికయ్యే 100 శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాలని, నాఫెడ్ ద్వారా సేకరణకు అనుమతినిస్తూ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.









