విశాఖపట్నం ఐటీ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు రూ. 1.25 లక్షల కోట్ల (15 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ నిర్వహించనున్నారు. 1 గిగావాట్ సామర్థ్యంతో తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లోని 600 ఎకరాల్లో ఈ కేంద్రం నిర్మితం కానుంది.
ఈ పర్యటనలో భాగంగా సీఎం సింహాచల అప్పన్నను దర్శించుకుని, అనంతరం రైల్వే జోన్ అధికారులతో భేటీ అవుతారు. గూగుల్ ప్రతినిధులతో ఇప్పటికే విందు భేటీ ముగించిన సీఎం, ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.









