పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించింది. హర్షిత 584, లక్ష్మీ అఖిల 580 మార్కులతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు.
మొత్తం 35 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు రుద్రాణి తెలిపారు. 115 మంది పరీక్ష రాయగా, 91 మంది ఉత్తీర్ణులయ్యారు, మొత్తం 80% ఉత్తీర్ణత శాతం నమోదైంది# కొత్తూరు మురళి.










