సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిన ఓపెన్ స్కూల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా పదిలో 8వ స్థానం, ఇంటర్‌లో 11వ స్థానంలో నిలిచిందని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. పదో తరగతికి 560 మంది హాజరు కాగా 125 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్‌లో 1632 మందికి 686 మంది పాసయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షల ద్వారా తిరిగి రాసుకునే అవకాశం ఉందని డీఈవో తెలిపారు.










