అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఆరడిగుంట, చిన్నకొండ చారాలలో ఆదివారం శ్రీ పటాలమ్మ మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమాది కార్యక్రమాలలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు# కొత్తూరు మురళి.









