సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

0
2

అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో రామ్మూర్తి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

దామలచెరువు గ్రామానికి చెందిన రామ్మూర్తి, పుంగనూరులో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అతన్ని సదుం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామ్మూర్తి మృతి చెందడంతో, అతని కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.