చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పిట్టావాండ్లపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై ఆన్‌లైన్, నగదు రూపంలో బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం.
వారి వద్ద నుంచి రూ. 3,59,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితులపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు.









