ఈరోజు గంజహళ్లి గ్రామాన్ని సందర్శించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు.ఇటుక బట్టిలకు అమ్ముకునే ఉద్దేశంతో చెరువు ఒండ్రు మట్టిని తరలించడం దారుణమని మండిపడ్డారు.ఈ సందర్భంగా జేసీబీలు, లారీలు నిలిపివేసి నిరసన తెలిపారు.
అక్రమ ఒండ్రు మట్టి రవాణా ను ప్రశ్నించిన తమ నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఇలాగే ఉండదు. అధికార దుర్వినియోగాన్ని అధికారులు గుర్తించాలి అని గట్టిగా హెచ్చరించారు.
టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, కానీ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోరని స్పష్టం చేశారు.గత రెండు వారల క్రితం రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ చెరువును సందర్శించి అక్రమ మైనింగ్‌ను ఆపాలని అధికారులకు సూచించినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి మారలేదని విమర్శించారు. దీనిని బట్టి చూస్తే అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారు కూడా పసుపు చొక్కాలు వేసుకుంటే బాగుంటుంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగితే పెద్ద ఎత్తున రైతులు, యువత, కార్యకర్తలతో కలిసి గంజహళ్లి గ్రామాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అధికారులు కళ్ళు తెరిచి చూసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
గంజహళ్లిలో టిడిపి నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని. చెరువు మట్టి తవ్వకాలు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు.దీనివల్ల బోర్లు ఎండిపోతూ, రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారుతోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.
సూపర్ సిక్స్ హామీలను విస్మరించి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం కుప్పకూలుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండలం కన్వీనర్ బి.ఆర్ బసిరెడ్డి, గోనెగండ్ల మండల కన్వీనర్ కే.వి కృష్ణారెడ్డి, గోనెగండ్ల మండల వైస్ ఎంపీపీ అల్వాల వెంకటరామి రెడ్డి,మండల ఉపాధ్యక్షుడు చికెన్ రాజా, రాష్ట్ర రైతు ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు తిరుమల రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్, మాజీ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి, జిల్లా యువజన కార్యదర్శి ఇమ్రాన్, గంజహళ్లి మాజీ సర్పంచ్ రాముడు, మహేశ్వర్ రెడ్డి, మాణిక్య రెడ్డి, కోటేకల్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మన్న, మెహన్ రెడ్డి, పులికొండ, గిడ్డయ్య, కృష్ణా, భరత్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.










