చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన 33 ద్విచక్ర వాహనాలకు గాను 25 వాహనాలను వేలం వేయగా, ప్రభుత్వానికి రూ.3,74,060 ఆదాయం సమకూరింది. ఈ వేలంపాట పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణంలో సూపరిండెంట్ కృష్ణకిషోర్‌రెడ్డి సమక్షంలో శనివారం జరిగింది. వేలం ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు# కొత్తూరు మురళి.










